బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి నివాసంలో అక్రమ అరెస్టుల పర్వం ఉమ్మడి మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల MLC అంజిరెడ్డి ని శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని MLC అన్నారు. రామచంద్రపురంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకొంటుదన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేయాలని చూడటం దురదృష్టకరమన్నారు. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించారు.