నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగు పర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూర్ లలో నిర్మిస్తున్న ఈ.ఎల్.ఎస్.ఆర్ ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.