అనంతపురం జిల్లా రాయదుర్గంలో శాంతినగర్ వద్ద ప్రమాదవశాత్తు కిందపడిన వెంకటాపురం కు చెందిన మంజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శుక్రవారం మధ్యాహ్నం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.