చీమకుర్తి మండలంలోని దివ్యాంగులందరూ తమ దగ్గర్లోని సచివాలయాల్లో పెన్షన్ల రీ వెరిఫికేషన్ సందర్భంగా జారీచేసిన నూతన మెడికల్ బోర్డు సదరం సర్టిఫికెట్లను పొందాలని చీమకుర్తి పట్టణ దివ్యాంగుల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ బుధవారం తెలిపారు. బుధవారం చీమకుర్తిలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల దివ్యాంగులకు ప్రభుత్వం వైద్యులచే పరీక్షలు నిర్వహించగా కొత్త పర్సంటేజ్ లతో కూడిన వైద్య ధ్రువీకరణ పత్రాలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.