ఋతుపవనాల సందర్భంగా వర్షాకాలంలో సంభవించే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు,వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతా చర్యల పై ప్రత్యేక దృష్టి సారించాలని , ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు భాగస్వామ్యం కావాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎమ్ ఎన్. హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ లతో కలసి సింహాచలం దేవస్థానం పుష్కరిణి కోనేరు ఆవరణలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు.