పేద ప్రజల కోసం,కార్మికులు, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జనగామ పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య అన్నారు.అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల శనివారం జనగామ పట్టణ కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ AISF సభ్యుడి నుండి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారని గుర్తు చేశారు.పేద ప్రజల కోసం కార్మికులు,కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడని కొనియాడారు.