నల్గొండ జిల్లా, దేవరకొండ పట్టణంలోని వినాయక విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలు బుధవారం సాయంత్రం హల్చల్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి రోడ్డు లోని వినాయక విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలు విగ్రహాలతో వెళుతున్న ప్రతి వాహనాన్ని ఆపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.