సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఆకివీడుకు చెందిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరి రూ.93 లక్షలు కోల్పోయారు. బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని, ఇన్కమ్ టాక్స్ అధికారినని ఒకరు వాట్సాప్ వీడియో కాల్‌లో బెదిరించగా, ఆధార్ కార్డు మిస్‌యూజ్ అయ్యిందని నమ్మబలికి దఫాదఫాలుగా 15 ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు గురువారం మధ్యాహ్నం 2:30 కు వెల్లడించారు.