ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సాయం అందించారు. హిందూపురం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు రాజగోపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ విషయం మంత్రి దృష్టికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు తీసుకురావడంతో ఆయన స్పందించి 25000 ఆయన తరపున అందించారు ఏపీడబ్ల్యుజే తరఫున 25000 మొత్తం 50000 రూపాయలు మంత్రి చేతుల మీదుగా రాజగోపాల్కు అందించారు. వైద్య చికిత్స పరంగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.