క్షణికావేశంలో చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి మానసిక నిపుణుడు డాక్టర్ వివశ్వన్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. ప్రపంచ జనాభా 700 కోట్లు ఉండగా 100 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్‌కు గురవుతున్నారని అన్నారు. మానసిక సమస్యలకు హెల్ప్‌లైన్ నంబర్ 14416ను సంప్రదించాలన్నారు.