పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఏఎన్ఎంలపై పని భారం తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాత్రి సమయంలో యాప్లో వివరాలు నమోదు చేయాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.