ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో దళితుల కంది పంటను జేసీబీలతో నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న డిమాండ్ చేశారు. సోమవారం ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. భూములు సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లేకపోతే తీవ్ర ఆందోళనకు సిద్ధమంటూ ఓర్వకల్లు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.