అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పిహెచ్ సీ ని శుక్రవారం ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆకస్మిక తనికి నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉన్న ల్యాబ్ లో రికార్డులను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి వైద్య సిబ్బంది సేకరించిన రక్తపు నమూనాలు అందజేయడం పై ఆరా తీశారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలను సీజనల్ వ్యాధుల పైన దోమల నివారణ పై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలతో చైతన్యపరిచి రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి డివిజనల్ అధికారి సూచించారు.