భవ్య సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 1962 అంబులెన్స్ లో చేతివాటానికి పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆ సంస్థ ఓఈ కే.రాజేష్, హెచ్ఆర్ రవితేజపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన సామాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం ఆయన పాడేరులో మీడియాతో మాట్లాడారు. చింతపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి డాక్టర్ ఉద్యోగం ఇస్తానని, ఆ ఇద్దరు వ్యక్తులు నగదు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.