విశాఖపట్నం నగరంలో పర్యాటక అభివృద్ధికి మరో మైలురాయి పడింది. శనివారం ఎంపీ మథుకుమిల్లి శ్రీభరత్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిసి ఎంవీపీ కాలనీ అప్పుఘర్ సమీపంలోని యాత్రినివాస్ (హరిత హోటల్) ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రజల కోసం ప్రారంభించారు..విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. నగరానికి వచ్చే పర్యాటకులు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. విశాఖలో ఆహారం, సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు అన్నీ కలిసివున్నాయన్నారు