లింగంపేట మండలంలోని మోతే గ్రామంలో ప్రజా పంథా పార్టీ నుండి సిపిఐ పార్టీలో చేరిన ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి బాలరాజు, మరియు పార్టీ కార్యకర్తలు శుక్రవారం మోతే గ్రామంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీలు చేర్చుకోవడం జరిగింది. నేటి భౌతిక పరిస్థితికి అనుకూలంగా భారత దేశంలో ఎర్రజెండాలు ఐక్యం కావడానికి మనమంతా కృషి చేయాలని అట్లాగే ప్రజల పక్షాన వారి సమస్యల సాధన కోసం నిలబడి పోరాడాలని అన్నారు. ఈ ప్రాంతంలో సిపిఐ పార్టీ విధానాలకు అనుకూలంగా వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తామని ఈరోజు చేరిన బాలరాజు మరియు మిగతా కార్యకర్తలు తెలియజేశారు.