మక్తల్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నైజాం సర్కార్లపై పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమెను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితో విగ్రహాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.