నిబద్ధత, విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు భీమవరంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, మంత్రి నారాయణ నరసాపురం పార్లమెంటరీ టిడిపి జిల్లా కమిటీ ఎన్నికలకు పరిశీలకునుగా రావడం ఆయన ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా కమిటీ ఎన్నికవుతుందని తెలిపారు. గతం నుంచి తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా కంచుకోటగా నిలుస్తోందని అన్నారు.