కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాపాగ్ని నది తీర ప్రాంతం వెంబడి దాదాపు 20 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారని చక్రాయపేట జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి కడపలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు ఇప్పటివరకు మండలానికి 120 టన్నుల యూరియా వచ్చిందని, ఇంకో 70 టన్నులు యూరియా అత్యవసరంగా అవసరం ఉందని ఆయన చెప్పారు. చక్రాయపేట మండలంలో వర్షపాతం తక్కువ అని కరువు మండలం గా కూడా ప్రకటించలేదని పేర్కొన్నారు. అనంతరం వేంపల్లి జడ్పిటిసి రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో కూడా యూరియా కొరత ఉందని చెప్పారు.