సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ 2025 పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 48 విద్యాసంస్థల నుండి 312 మంది విద్యార్థులు ఈ కళా ఉత్సవ్ పోటీల్లో పాల్గొంటున్నారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు ఈ కళా ఉత్సవ్ పోటీల్లో తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు.