మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. యూరియా అధిక ధరలకు విక్రయించిన యూరియాతోపాటు రైతులకు బలవంతంగా పురుగుమందులు విక్రయిస్తే షాపు నిర్వాహకులపై అఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో 4,20,000 ఎకరాలలో వివిధ పంటలు సాగుతున్నాయని, ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి జిల్లాలో 27,350 మెట్రిక్ టన్నుల యూరియా ను రైతులకు పంపిణి చేశామన్నారు. యోనియా సరఫరా లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆదేశాలతో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.