గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద రైల్వే అధికారులు, కార్మికులు బుధవారం వినూత్నంగా టెంకాయల వినాయకుని ఏర్పాటు చేశారు. మొత్తం 1661 టెంకాయలతో ఎంతో చూడముచ్చటగా, ఆకర్షణీయంగా వినాయకుని ప్రతిష్టించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంకాయల వినాయకుని వీక్షించడానికి జనాలు తరలివస్తున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.