భద్రాచలం పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి లోకేష్ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందాడు.. ఎట్టపాక గ్రామానికి చెందిన సరిత, నాగమోహన్ చార్యుల కుమారుడు లోకేష్ ప్రతిరోజు లాగే ఈరోజు ఉదయం పాఠశాలకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడని కుటుంబీకులు తెలిపారు.. బాలుడి ని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు దీంతో బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..