రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాలలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాగం శ్రీకాంత్, ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ గత ఏడేళ్లుగా పెండింగ్ లో ఉన్న రూ.8,641 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్స్, ప్రభుత్వ హాస్టళ్ళ విద్యార్థులకు పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. నూతన విద్య విధానాన్ని తెలంగాణ రాష్టంలో అమలు చేయకుండా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని అన్నారు.