ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని బెలుగుప్ప పి.హెచ్.సి వైద్యాధికారి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, బెలుగుప్ప గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాలను శ్రీరంగాపురం పీ హెచ్ సీ వైద్యాధికారి రిషికేష్ లతో కలిసి ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లోనూ 150 మంది కి ఓపి చూసి వివిధ రకాల పరీక్షలను చేసి మందులను పంపిణీ చేశామని వైద్యాధికారులు పేర్కొన్నారు.