రైల్వే కోడూరు ప్రాంతంలో బొప్పాయి రైతులు దళారుల మోసాలకు బలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. చిట్వేల్ మండలం మైలపల్లి దారి లోని ఓ సూరమ్మ గుడి వద్ద శుక్రవారం బొప్పాయి రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూటు విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ చీడపురుగులా మారిందన్నారు. బొప్పాయి కిలోకి 15 రూపాయలు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు