నల్గొండ జిల్లా, డిండి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం డిండి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమలాస్పదంగా వస్తున్న ఆటోను ఆపి పరిశీలించగా అందులో ఉన్న 420 కిలోల నల్ల బెల్లం, 100 కిలోల పట్టికను స్వాధీనం చేసుకొని, ఆటో డ్రైవర్ సభావాత్ సురేందర్ పై కేసు నమోదు చేసి, నాటు సారాయి, సామాగ్రిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు.