కల్వకుంట్ల కవిత ఈరోజు కాలేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం పై చేసిన వ్యాఖ్యలపై బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వీడియో సందేశం ద్వారా స్పందించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కవిత ప్రెస్ మీట్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు కాలేశ్వరం ప్రాజెక్ట్ లో కల్వకుంట్ల కుటుంబం ఎంత దోచుకున్నద అనేది అర్థమైంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గులాబీ గొర్రెలను వారి ఎత్తుగడలను బట్టబయలు చేయడంతోనే గత ఎన్నికల్లో వి ఆర్ ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందిందన్నారు.