కొత్తపేటలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ జీవివి సత్యనారాయణకు కొత్తపేట ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యానందరావు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ మేరకు ఆయన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొత్తపేట ఆర్డిఓ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. అనంతరం ఆయనను బలపరిచిన కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి వాటిని ఆర్డీవో సత్యనారాయణకు అందజేశారు.