ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గురువారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్దెడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. అనురాధ మాట్లాడుతూ.. దుద్దెడ గ్రామంలో రాజీవ్ రహదారి ఎంట్రీ, ఎగ్జిట్, గ్రామంలోని ముఖ్యమైన చౌరస్తాలలో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి,