తమిళనాడులోని ఊటీలో ఏనుగు దాడిలో బాపట్ల జిల్లా వాసి మృతి చెందినట్లు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందింది.అక్కడ ఒక టీఎస్టేట్ కు కేర్ టేకర్ గా పనిచేస్తున్న సుకుందరావు(35) నివాసం పై మందలో నుండి తప్పిపోయి వచ్చిన ఒక ఏనుగు ఆదివారం రాత్రి దాడి చేయగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన వూటీ పోలీసులు మృతుడి ఆధార్ కార్డులో ఉన్న చిరునామాను బట్టి అతడిని బాపట్ల జిల్లా వాసిగా గుర్తించి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది