జనగామ జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.జనగామ పట్టణంలోని గిర్నిగడ్డలో ఇంటిముందు నీళ్ళు పడుతుండగా సామిశెట్టి భాగ్యలక్ష్మి అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చి ఎత్తుకెళ్లాడు.చైన్ లాక్కొని మహిళను నెట్టి వేయడంతో మహిళాకు గాయాలు అయ్యాయి,బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.పట్టపగలే చైన్ స్నాచింగ్ జరగడంతో పట్టణ ప్రజల్లో తీవ్ర కలకలం నెలకొంది.