గంజాయి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని జీ.మాడుగుల ఎస్సై షణ్ముఖరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు గంజాయి కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులను పిలిపించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి నేరస్తులపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.