బాపట్ల జిల్లాకు చీరాలను హెడ్ క్వార్టర్స్ చేయాలని,ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ చీరాల కేంద్ర జిల్లా సాధన సమితి పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టింది.జిల్లాల మార్పు చేర్పులపై ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ పోస్ట్ కార్డులు పంపుతున్నట్లు సమితి కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు గురువారం మీడియాకు తెలిపారు.ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.