రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదంలో అర్బాజ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ నుండి ఆరాంఘర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న అర్బాజ్, ఏజీ కాలేజ్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి లారీ కిందపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.