ఇటీవల మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆత్య పాత్యా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికవడం అభినందనీయమని క్రీడా నిర్వాహక అద్యక్షులు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి ఉప్పలయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను వారు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహారాష్ట్ర బుల్ధానలో జరిగే పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.