విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరులోని మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ ఘర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యలో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్స్, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ జిల్లాకి, రాష్ట్రానికి ,దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.