సెప్టెంబర్ 9వ తారీకు మడకశిరలో నిర్వహిస్తున్న అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్లను మడకశిర సమన్వయకర్త ఈర లక్కప్ప శనివారం మడకశిర పట్టణంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్కప్ప అన్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు గణపతి బప్పా మోరియా రావాలప్ప యూరియా అంటూ వినోద్ నా రీతిలో నిరసన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ రవిశేఖర్ రెడ్డి, యువజన నాయకులు శేషాద్రి,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు నరసింహమూర్తి, మడకశిర సోషల్ మీడియా కో కన్వీనర్ గోవర్ధన్ రాయలసీమ పాల్గొన్నారు.