పత్తికొండలో టిడిపి కార్యాలయం నందు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శ్యాం బాబు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 9 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నాలుగు లక్షల 81000 మంజూరు అయిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.