అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాలైన అంకంపల్లి, హనిమరెడ్డిపల్లి, కాలువ పల్లి గ్రామాల్లో జిల్లా అధికారులు మంగళవారం పరిశీలన చేశారు. అంకంపల్లి గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జడ్పీ సీఈవో జి. శివ శంకర్ పరిశీలించి గ్రామంలోని తడి పొడి చెత్తను కేంద్రానికి తీసుకురావడంపై గ్రామంలో డోర్ టు డోర్ వెళ్లి ఆరా తీశారు. ఇదేవిధంగా కాలువపల్లి హనిమ రెడ్డి పల్లి గ్రామాల్లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన డి యల్ డి వో నాగేశ్వరరావు సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలన్నారు.