తెలంగాణ ప్రజల కరువును తీర్చే కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ కేసీఆర్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా తొగట మండలంలోని మల్లన్న సాగర్ లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం గులాబీ శ్రేణులతో కలిసి కెసిఆర్ తీసుకొచ్చిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ నీటితోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ల చిత్రపటానికి జలాభిషేకం కార్యక్రమ