ఓర్వకల్లు మండలం కేతవరం కొత్త బిల్డింగులలో వర్షపు నీరు, మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సంఘం నాయకురాలు టి.నాగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానికులతో కలిసి ఈ సమస్యను పరిశీలించి, గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.