వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ గారు ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు.ABC లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.