YSR కడప జిల్లా వల్లూరు మండల పరిధిలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కడప వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు తప్పెట్ల సమీపంలో ఉన్న రైల్వే వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను స్థానికులు వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వారు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.