కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో యూరియా కొరత ఉందనేది కేవలం వైసీపీ నాయకుల ఫేక్ ప్రచారం మాత్రమేనని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులురెడ్డి అన్నారు. కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో 173. 247 టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు. యూరియా కొరత లేదని, రైతులు ఎవరు కూడా వైసిపి నాయకుల ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతుల్లో, ప్రజల్లో మంచి పేరు వస్తుందన్న అక్కస్సుతోనే ఈ అసత్య ప్రచారాలను వారు చేస్తున్నారన్నారు.