ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరుకుంపాలెం వద్ద గల సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, సరస్వతి జూనియర్ కళాశాలను సందర్శించి డిఎస్సి-2025 కు సంబంధించి జరుగుచున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని ఈ సందర్భంగా విద్యా శాఖాధికారులను ఆదేశించారు.