జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పెద్దగుట్టలో వెలిసిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం సన్నిధిలో శ్రావణమాసం అమావాస్య సందర్భంగా శనివారం నుండి ఆదివారం సాయంత్రం వరకు అఖండ భజన కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ రంగనాయక స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షురాలు కాల్వ రాధిక రామిరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.