అల్లుడు పై అత్త బీరు బాటిల్ తో దాడి పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లికి అన్నం వడ్డించి సపర్యలు చేయాలని అత్తను కోరడంతో, ఆమె ఆగ్రహించి అల్లునిపై బీర్ బాటిల్తో దాడి చేసింది. ఆదివారం సాయంత్రం అంగళ్లు లో వెలుగు చూసిన ఘటనపై బాధితులు ముదివేడు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పుంగనూరు కి చెందిన గంగరాజు (40), కురబలకోట మండలంలోని అంగళ్లు టమోటా మార్కెట్ యార్డు వద్ద కాపురం ఉంటున్నాడు. భార్య రమణి పుంగునూరుకు వెళ్లడంతో ఇంట్లో పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లికి వంట చేసి పెట్టడానికి సహాయకులు లేక, గంగరాజు తన అత్త లక్ష్మీదేవిని వంట చేసి పెట్టాలని కోరగ అత్త బీరు బాటిల్ తో దాడి చేసింది