మురుగులేని పల్లెలు నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో పెద్ద తాడేపల్లి, చిన్నతాడేపల్లి, వెంకట్రావు పాలెం, అప్పారావుపేట అమృతపురం, లింగారాయుడు గూడెం, ఆరుగొలను, కుంచనపల్లి, గ్రామాల్లో మురుగు నీటి సమస్య పరిష్కరించే మ్యాజిక్ డ్రైన్ల పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. పల్లెలను పర్యాటక ప్రాంతాల మాదిరి సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ముందున్న ధ్యేయమని అన్నారు.