పెదచెల్లపల్లి మండలంలోని వెంగళపురంలో ఎస్సై కోటయ్య గణేష్ గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... గ్రామాల్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఉత్సవ కమిటీల నిర్వాహకులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మద్యం తాగి గణేష్ మండపాల వద్ద ఉండవద్దన్నారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.